దివ్యాంగులకు పరికరాల పంపిణీ : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్

దివ్యాంగులకు పరికరాల పంపిణీ : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు : అవసరమైన దివ్యాంగులకు పరికరాలను పంపిణీ చేయనున్నట్లు కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి కేవీఎస్​గార్డెన్​లో దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి కామారెడ్డి నియోజకవర్గంలోని దివ్యాంగులు వచ్చారు.

ఇందులో అవసరమైన వారికి చేతి కర్రలు, వినికిడి యంత్రాలు, 3 చక్రాల సైకిళ్లు అందించారు. అనంతరం కలెక్టర్​ బేటీ బచావో బేటీ పడావో పోస్టర్​ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్​జిల్లా అధికారి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.