![కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ](https://static.v6velugu.com/uploads/2021/06/distribution-of-essentials-under-the-auspices-of-venkataswamy-(Kaka)-Foundation-in-mancherial-district_yF9JjhlPEO.jpg)
మంచిర్యాల జిల్లా: కరోనా కష్టాల్లో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు వెంకటస్వామి (కాకా) ఫౌండేషన్ తన వంతు కృషి చేస్తోంది. మందమర్రి మండలం ఊరు రామక్రిష్ణపూర్, పులిమడు గ్రామాల్లోని కరోన బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మెడికల్ కిట్లను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు మద్ది శంకర్, పైడిమల్ల నర్సింగ్ తదితర బిజెపి నాయకులు, కార్యకర్తలు పంపిణీ చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి లోని యాభై మంది ప్రయివేట్ టీచర్స్ కు నిత్యావసర సరుకులను అందజేసిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు మహంకాళి శ్రీనివాస్, బిజెపి నాయకులు, కార్యకర్తలు.