చిరు వ్యాపారులకు తోపుడు బండ్ల పంపిణీ

చిరు వ్యాపారులకు తోపుడు బండ్ల పంపిణీ

భద్రాచలం, వెలుగు : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్​ ఆఫ్​ భద్రాచలం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని పేద చిరు వ్యాపారుల జీవనోపాధి కోసం తోపుడు బండ్లను పంపిణీ చేశారు. 

సుమారు రూ.2లక్షల విలువ చేసే 12 బండ్లను పేద వ్యాపారులకు అధ్యక్షురాలు మహాలక్ష్మి అందించారు. భద్రాచలం, మొయినాబాద్​ రోటరీ క్లబ్​లు ఈ కార్యక్రమం నిర్వహించాయి. కార్యదర్శి రాజశేఖర్​, కోశాధికారి విద్యాసాగర్, అసిస్టెంట్​ గవర్నర్​ వేణుగోపాల్, పాస్ట్ ప్రెసిడెంట్స్ యశోద రాంబాబు, మునికేశవ్, రఫీ, మధు, అజయ్​కుమార్, అజీం పాల్గొన్నారు.