కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

పర్వతగిరి/వర్ధన్నపేట, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంతో ప్రజలందరికీ పథకాలు అందుతాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌‌‌‌‌‌‌‌.నాగరాజు చెప్పారు. వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా పర్వతగిరి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 191 మందికి మంజరైన కల్యాణలక్ష్మి చెక్కులను బుధవారం స్థానిక ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు.

ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని వచ్చే నెల 6 వరకు ప్రజాపాలన అప్లికేషన్లు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగులాల్, ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి, ఎంపీడీవో సంతోష్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఎంపీవో శ్రీనివాస్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. అలాగే వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎంపీడీఓ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో మండలానికి చెందిన 35 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌‌‌‌‌‌‌‌ చెక్కులు పంపిణీ చేశారు.  

అనంతరం హన్మకొండ జిల్లా ఐనవోలులోని మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించి, జాతర ఏర్పాట్లు, సౌకర్యాలపై ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.