కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి నియోజక వర్గంలోని ఆయా మండలాల్లో 256 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి పంపిణీ చేశారు. రాజంపేట మండలంలో 18 మందికి, భిక్కనూరులో 34, దోమకొండలో 49, బీబీపేటలో 32, మాచారెడ్డిలో 39, రామారెడ్డిలో 36, కామారెడ్డి రూరల్లో 41, కామారెడ్డి టౌన్లో 151 మందికి చెక్కులు అందజేశారు.
స్వదేశీ మేళా బ్రోచర్ల ఆవిష్కరణ
స్వదేశీ జాగరణ మంచ్, స్వావలంబి భారత్అభియాన్సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 27 వరకు హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించే స్వదేశి మేళా బ్రోచర్లను మంగళవారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి ఆవిష్కరించారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రొత్సహించే విధంగా మేళా ఏర్పాటు చేయటం సంతోషకరమన్నారు. ప్రతినిధి రచ్చ శ్రీనివాస్, స్వదేశీ జాగరణ మంచ్ ప్రాంత ప్రచార ప్రముఖ్కేశవ్సోని, ఇందూర్ విభాగ్ జిల్లా కో కన్వీనర్ రాజాగౌడ్, జిల్లా కన్వీనర్ రాహుల్, మనీష్, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.