కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందించి పేషెంట్లకు అండగా నిలుస్తుంది కాకా వెంకటస్వామి ఫౌండేషన్. కరోనా పేషెంట్లు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న విపత్కర పరిస్థితుల్లో వారికి తమవంతు సాయంగా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందించాలని మాజీ ఎంపీ, బీజేపీ స్టేట్ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు మంచిర్యాల ఏరియా హాస్పిటల్ డాక్టర్లు. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్స్‌కు వీటిని అందిస్తున్నారు. పది లీటర్ల కెపాసిటీ గల ఒక్కో పరికరం విలువ లక్ష రూపాయలు ఉంటుందని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. శనివారం మంచిర్యాల ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్ కు కాకా ఫౌండేషన్ ప్రతినిధులు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ అందజేశారు.
గతేడాది కరోనా లాక్డౌన్ టైమ్‌లో కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ వివేక్ వెంకటస్వామి పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్‌తో ఆక్సిజన్ అందక చాలామంది పేషెంట్లు అవస్థలు పడుతున్న క్రమంలో వివేక్ వెంకటస్వామి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందజేయడం అభినందనీయమని జిల్లా ప్రజలు అంటున్నారు.
ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు ఎంతో ఉపయోగం
కరోనా చికిత్సలో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు ఎంతో ఉపయోగపడుతాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా చెన్నూర్ హాస్పిటల్‌కు రూ.లక్ష విలువైన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ను డొనేట్ చేశారు. ఇందుకు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ వివేక్ వెంకటస్వామికి వైద్య ఆరోగ్యశాఖ తరపున డా. అరవింద్ ధన్యవాదాలు తెలిపారు.