
కమలాపూర్, వెలుగు : హుజూరాబాద్‌కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని రెసిడెన్షియల్ స్కూల్ టెన్త్ స్టూడెంట్లకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకుడు రిటైర్డ్ టీచర్ గంగిశెట్టి జగదీశ్వర్, ప్రిన్సిపాల్ ఓదెల మల్లయ్య మాట్లాడారు. స్టూడెంట్లు బాగా చదువుకొని పేరెంట్స్‌కు, స్కూల్‌కు పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో బాలికల ప్రిన్సిపాల్ ప్రపుల్ల దేవి, హెచ్‌ఎం పవన్‌కుమార్ పాల్గొన్నారు.