గోదావరిఖని, వెలుగు : చెన్నూర్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి–సరోజన దంపతుల పెండ్లి రోజు సందర్భంగా గురువారం గోదావరిఖని ఇందిరానగర్‌లో పేదలకు కాంగ్రెస్ లీడర్లు చీరలు, టవళ్లు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ తాళ్లూరి పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చీఫ్‌గెస్ట్‌గా ఉమ్మడి రాష్ట్రాల ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు గుమ్మడి కుమార స్వామి హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ కాకా మనువడు గడ్డం వంశీకృష్ణను గెలిపించడానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు, ఓట్లు వేసిన ప్రతి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్, పట్టణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పంజా శ్రీనివాస్, లీడర్లు సదానందం, సూర్య, కొమురయ్య, అశోక్, తదితరులు పాల్గొన్నారు. విఠల్‌నగర్‌లోని అనాథాశ్రమంలో పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు.
జమ్మికుంట, వెలుగు : జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలోని స్పందన అనాథ శరణాలయంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి–సరోజన దంపతుల పెండ్లి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ లీడర్ అఖిల్ ఆధ్వర్యంలో అనాథ శరణాలయంలోని పిల్లలతో కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా వివేక్ దంపతులకు చిన్నారులు ఫోన్‌లో వివాహ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో లీడర్లు
శ్రీరామ్, రవీందర్, వేల్పుల ప్రశాంత్ యాదవ్, ఐలన్న, వినయ్, వివేక్, మణికంఠ, మనోజ్ పాల్గొన్నారు.