కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లింలకు చీరలు పంపిణీ

పెద్దపల్లి, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి ఫౌండేషన్​ ఆధ్వర్యంలో, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం ముస్లింలకు రంజాన్​ సందర్భంగా చీరలు పంపిణీ  చేశారు.  జిల్లా కేంద్రంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కాకా ఫౌండేషన్​ సభ్యుడు సోడాబాపు 200 మంది పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోడాబాపు మాట్లాడారు.  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి ఆశీస్సులతో కాకా ఫౌండేషన్​ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం మాదిరిగానే పేద ముస్లిం మహిళలకు చీరలు పంచామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.