చంద్రవెల్లి గ్రామంలో రైతులకు జీలుగ విత్తనాల పంపిణీ : వందన

బెల్లంపల్లి, వెలుగు:  సబ్సిడీపై జీలుగ విత్తనాలను పంపిణీ చేసినట్లు బెల్లంపల్లి మండల వ్యవసాయ అధికారిణి వందన తెలిపారు. సోమవారం మండలంలోని చంద్రవెల్లి గ్రామంలోని పీఏసీఎస్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు జీలుగ విత్తనాలు పంపిణీ చేశామని, 30 కిలోల సంచి ధర రూ.2,790 ఉండగా సబ్సిడీ కింద రూ.1116కే అందజేస్తున్నట్లు చెప్పారు. 

ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈవో కె.నాగదీప్తి, పీఏసీఎస్ సీఈవో కె.వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.