- గొర్రెలు, బర్రెలు, చేపల పంపిణీ కూడా ఉపాధి కల్పనే: తలసాని
హైదరాబాద్, వెలుగు: ‘‘బయట కొంతమంది మూర్ఖులు గొర్రెలు, బర్రెలు, చేపల పంపిణీపై విమర్శలు చేస్తున్నరు. కోటి మంది జనాభా ఉన్న ఈ సామాజిక వర్గాలను కించపరిచేలా మాట్లాడుతున్నరు. చేపల పంపిణీతో 34 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. ఇది ఉద్యోగం కాదా? ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగమేనా” అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. చేపలు, గొర్రెల పంపిణీ వంటి పథకాలతో కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నామని, వీటిని కూడా ఉపాధి కింద పరిగణనలోకి తీసుకోవాలన్నారు. చేపల పెంపకానికి ప్రోత్సాహంపై గురువారం అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు.