
సిద్దిపేట రూరల్, వెలుగు: విద్యార్ధులు ఇష్టంగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ ఈ . వికాస్ అన్నారు. బ్యాంక్ రూరల్ పబ్లిసిటీ లో భాగంగా సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లిలోని గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ లో మంగళవారం ఆయన స్టూడెంట్లకు స్పోర్ట్స్ టీషర్ట్ లు, ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్స్, స్పోర్ట్స్మెటీరియల్ అందజేసారు. ఆడపిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెంచాలన్న ఉద్దేశంతో స్పోర్ట్స్కిట్స్ పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ హెడ్ వై. వి. రాఘవ, సంజయ్, చీఫ్ మేనేజర్లు ప్రదీప్, గోపీ, స్కూల్ ప్రిన్సిపాల్ కె. విష్ణువర్ధన్ రెడ్డి పాల్గోన్నారు.