స్టూడెంట్స్ కు పరీక్ష సామగ్రి పంపిణీ

ఖమ్మం టౌన్, వెలుగు :  తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారుల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, దివంగత తుమ్మలపల్లి రామారావు నాలుగో వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఖమ్మంలోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ లోని 300 మంది స్టూడెంట్స్ కు పరీక్ష సామగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫోరం జిల్లా అధ్యక్షుడు రుక్మారవు, తుమ్మలపల్లి రామారావు సతీమణి విజయలక్ష్మి, భవ్య, కాస్తల రఘు, వసంత, శైలాజ, తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.