మధిరలో ట్రై సైకిళ్ల పంపిణీ

మధిరలో ట్రై సైకిళ్ల పంపిణీ

మధిర, వెలుగు : మధిరలోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయంలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్ ​పర్సన్, భట్టి సతీమణి మల్లు నందిని గురువారం దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 18 ఏండ్లుగా  అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పుడు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందించడం సంతోషంగా ఉందన్నారు.

భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం మధిర మండలం మడుపల్లి గ్రామానికి చెందిన కనకపూడి స్నేహ చదువులో ప్రతిభ కనబరుస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్ కోన ధని కుమార్

ద్వారా ప్రముఖ వ్యాపారి  పుల్లఖండం చంద్రశేఖరరావు ఇప్పించిన లాప్​టాప్​ను మల్లు నందిని ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ కాంగ్రెస్​ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, మిర్యాల రమణగుప్తా, కాంగ్రెస్​ పార్టీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.