ఓటర్ స్లిప్పులు పంపిణీ 80 శాతం పూర్తయింది : రోనాల్డ్ రాస్

ఓటర్ స్లిప్పులు పంపిణీ 80 శాతం పూర్తయింది : రోనాల్డ్ రాస్

ఎలక్షన్ అబ్ జర్వ్ చేయడానికి హైదరాబాద్ జిల్లాకు ఐదుగురు అధికారులు వచ్చారని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు.ఎలక్షన్ సమయం దగ్గర పడుతోంది మే 12న EVMల పంపిణీ, 13 న పోలింగ్ జరుగుతుందని అన్నారు. గత ఎంపీ ఎన్నికలకు 45 శాతం ఓటింగ్ జరిగిందని ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ 16వేలకు పైగా ఉంటే 9వేలకు పైగా ఓట్లు పోలింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు. 

మే 9, 10వ తేదీలలో పోస్టల్ బ్యాలెట్ కు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. వికలాంగుల కోసం సాక్ష్యం యాప్ అందుబాటులో ఉంటుందని రిజిస్టర్ చేసుకుంటే పోలింగ్ రోజు ఓటు వెయ్యడానికి ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ ఉంటుందని తెలిపారు. హోం ఓటింగ్ 571 మందికి గాను 532 ఓట్లు పోల్ అయ్యాయని అన్నారు. 3వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని వెల్లడించారు.  ఓటర్ స్లిప్పులు పంపిణీ 80 శాతం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ పోల్ శాతం ఏపి ఎన్నికలు మన మిద పడదని  రోనాల్డ్ రాస్ తెలిపారు.