నాణ్యతలేని చేపపిల్లలు మాకొద్దు: ఆంజనేయస్వామి

కారేపల్లి,వెలుగు: ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే నాణ్యత లేని చేప పిల్లలు తమకొద్దని  మత్స్యశాఖ జిల్లా అధికారి ఆంజనేయస్వామి పై మత్స్యకారులు మండిపడ్డారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసులో సోమవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేపపిల్లల పంపిణీ  కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే  చేపపిల్లలు తీసుకోవడానికి కారేపల్లి, పేరుపల్లికి చెందిన మత్స్యకారులు నిరాకరించారు.

 చేపపిల్లల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పంపిణీ చేసే పిల్లల లెక్కల్లో కూడా మోసాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీజన్​లో పంపిణీ చేయకుండా రెండు నెలల ఆలస్యంగా పంపిణీ చేస్తే అవి ఎప్పుడు పెరుగుతాయని ప్రశ్నించారు.