కాకా ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలోని యూపీఎస్​ స్కూల్‌‌‌‌‌‌‌‌లో చదువుతున్న స్టూడెంట్లకు కాకా వెంకటస్వామి ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌ తరఫున సోమవారం గొడుగులు పంపిణీ చేశారు. వివేక్‌‌‌‌‌‌‌‌ యువసేన అధ్యక్షుడు గొట్టపర్తి నరేశ్‌‌‌‌‌‌‌‌నాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బీజేపీ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ కన్వీనర్‌‌‌‌‌‌‌‌ పి.మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌ హాజరై చిన్నారులకు గొడుగులు అందజేశారు. 

ఈ సందర్భంగా మల్లికార్జున్ ​మాట్లాడుతూ సామాజిక కార్యక్రమాల నిర్వహణలో కాకా ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో వివేక్‌‌‌‌‌‌‌‌ యువసేన సభ్యులు గాండ్ల నరేశ్, లింగమూర్తి, సాగర్, రాజు, అనిల్, శేఖర్, పాల్గొన్నారు.

ధర్మారంలో.. 

ధర్మారం : కాకా ఫౌండేషన్​ఆధ్వర్యంలో ధర్మారం మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్‌‌‌‌ విద్యార్థులకు దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కాడే సూర్యనారాయణ సోమవారం గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ కాకా వెంకటస్వామి ఫౌండేషన్ తరఫున వారి కుటుంబ సభ్యులు  పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.

 కార్యక్రమంలో జంగిలి కిశోర్, దేవి మల్లేశం, తిరుపతి, మహేందర్ రెడ్డి, ప్రసాద్, దేవి రజినీకాంత్, తిరుపతి, మనోహర్ రెడ్డి, స్వామి, మురళి, రాజేశ్​పాల్గొన్నారు.