ఓటర్ స్లిప్పుల పంపిణీ వంద శాతం పూర్తి చేయాలి : తుషార్ కాంతా మహంతి

ఖమ్మం టౌన్, వెలుగు :  ఓటరు సమాచార స్లిప్పులు వంద శాతం పంపిణీ చేయాలని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ఎన్నికల సాధారణ పరిశీలకులు తుషార్ కాంతా మహంతి తెలిపారు. శనివారం ఎన్నికల పరిశీలకులు ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం, చిన్నవెంకటగిరి, పెద్ద వెంకటగిరి, తెల్దారుపల్లి, గుదిమల్ల గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు.  ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీని తనిఖీ చేశారు.

ఓటు హక్కును డబ్బు, మద్యం, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికతతో వేయాలని ఓటర్లలో అవగాహన కల్పించారు. సీ విజిల్ యాప్ గురించి చైతన్య పరిచారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కనీస మౌలిక సదుపాయాల కల్పన విషయమై అధికారులకు సూచనలు చేశారు.