![ఫర్టిలైజర్ దుకాణాల్లో రిజిస్టర్లు, బిల్లులు తప్పనిసరి : వినయ్ కుమార్](https://static.v6velugu.com/uploads/2025/02/district-agriculture-officer-vincent-vinay-kumar-inspected-the-fertilizer-shops-at-agros-rythuseva-kendra_GiS5awj892.jpg)
మెదక్ టౌన్, వెలుగు : జిల్లాలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలను తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని, ఈ–-పాస్ మిషన్లో ఎరువుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విన్సెంట్ వినయ్ కుమార్ అన్నారు. బుధవారం హవేళిఘనపూర్ మండలంలోని నాగాపూర్, ఫరీద్పూర్ పీఏసీఎస్, ఆగ్రోస్ రైతుసేవా కేంద్రం ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణాల్లో స్టాక్ బోర్డును పెట్టాలని, బిల్ బుక్స్, స్టాక్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలన్నారు. ఈ–పాస్ మెషిన్లో ఎరువులు అమ్మిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. దీంతో పాటు నాణ్యమైన పురుగు మందులు, ఎరువులను అమ్మాలని సంబంధిత డీలర్లకు ఆదేశించారు. యూరియా కొరత రాకుండా చూసుకోవాలని తెలిపారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.