మారుమూల ప్రాంతాల్లోలైబ్రరీల ఏర్పాటు : జిల్లా చైర్​ పర్సన్​ సుహాసిని రెడ్డి

మారుమూల ప్రాంతాల్లోలైబ్రరీల ఏర్పాటు : జిల్లా చైర్​ పర్సన్​ సుహాసిని రెడ్డి

రామాయంపేట, వెలుగు: గ్రంథాలయాలను మారుమూల ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ జిల్లా చైర్​ పర్సన్​ సుహాసిని రెడ్డి తెలిపారు. బుధవారం ఆమె రామాయంపేట  లైబ్రరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  యువత ముందుకు వస్తే మారుమూల గ్రామాల్లో సైతం గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. 

జిల్లాలో 16 గ్రంథాలయాలు  ఉండగా అందులో 4 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. రేగోడ్ నూతన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. మండల కేంద్రాల్లో 12 వేల పుస్తకాలు ఉండగా, పల్లె ప్రాంతాల్లో 6 వేల పుస్తకాలు ఉన్నాయని ఆమె తెలిపారు.