- జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోవర్ధన్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు : బాలల హక్కుల పరిరక్షణ కోసం న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోవర్ధన్ రెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యాలయంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాలబాలికలు, మనో వైకల్యం ఉన్న బాలలకు కూడా హక్కులు ఉంటాయని, వారి హక్కులకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వెంటనే జిల్లా న్యాయ సేవా సంస్థను ఆశ్రయించాలని సూచించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి మాట్లాడుతూ ప్రజల్లో న్యాయ పరిజ్ఞానాన్ని పెంపొందించడం కోసం న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ లీగల్ హెడ్ డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్స్ సత్యనారాయణ పిళ్లే, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ బొల్లెద్దు వెంకటరత్నం, డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బి.రవికుమార్, సీడబ్ల్యూసీ చైర్మన్ రమణారావు, న్యాయవాదులు, కౌన్సిల్ మెంబర్స్, పారా లీగల్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.