ధర్పల్లి, వెలుగు: రక్తహీనత లేకుండా గర్భిణులకు సుఖప్రసవం కోసం పోషకాహారం అవసరమని జిల్లా శిశు సంక్షేమాధికారి ఎస్కె రసూల్‌బీ అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన పోషణ్ పక్వాడ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. గర్భిణులు పోషకాహారంగా చిరుధాన్యాలు, కొర్రలు, రాగులు, బాదం, కాజు, రాగిజావా తీసుకోవాలన్నారు.
పోషకాహారంలో లభించే విటమిన్ల గురించి డాక్టర్ సుశాంత్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ, తహసీల్దార్మాలతి, సీడీపీఓ స్వర్ణలత, సూపర్ వైజర్లు బుజ్జి, సరిత, హెడ్మాస్టర్ నాగజ్యోతి, ఆరోగ్య సిబ్బంది, ఆశావర్కర్‌లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎడపల్లి , వెలుగు: బోధన్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ పక్వాడ కార్యక్రమంలో శనివారం ఎడపల్లి మండలం బాపునగర్ అంగన్వాడీ కేంద్రంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని సున్నా నుంచి ఐదేళ్ల వయసుగల చిన్నారులను పరిశీలించి పౌష్టికాహారంఇవ్వాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రంలో అందించే ఆహారంపై పిల్లల తల్లులకు ఐసీడీఎస్ మండల సూపర్వైజర్ విజయరాణి అవగాహన కల్పించి వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం దేవ కరుణ, అంగన్వాడీ టీచర్ లలిత, ఆశా వర్కర్ రంగమ్మ పాల్గొన్నారు.