ఇకపై అడవులు నరికితే కఠిన చర్యలుంటయ్ : జిల్లా కలెక్టర్ అనుదీప్

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్​

పాల్వంచ రూరల్, వెలుగు : పోడు భూముల సర్వే ప్రకారం అర్హులైన రైతులందరికి పట్టాలు పంపిణీ చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం ఆయన కలెక్టరేట్​మీటింగ్​హాల్​లో అటవీ సంరక్షణ, ప్లాంటేషన్​ పరిరక్షణ, పోడు పట్టాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి అడవులు నరికివేత చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా పోడు పట్టాలు పంపిణీ చేసిందని తెలిపారు.

కొన్ని మండలాల్లో ప్లాంటేషన్ ను అడ్డుకుంటున్నారని, పోలీస్ అధికారులు, తహసీల్దార్లు, ఫారెస్ట్​ సిబ్బంది సర్పంచులతో కలిసి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం బదిలీ అయిన డీఎఫ్ఓరంజిత్​నాయక్​ను అధికారులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఫారెస్ట్, పోలీస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.