లింగంపేట, వెలుగు: చారిత్రక కట్టడమైన లింగంపేట శివారులోని నాగన్న బావి పునరుద్ధరణ పనులను స్పీడప్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ స్థానిక ఎంపీడీఓ నరేశ్, పీఆర్ డిప్యూటీ ఈఈ గిరిధర్ ను ఆదేశించారు. గురువారం ఉదయం ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్కల్పనా రమేశ్‌తో కలిసి కలెక్టర్నాగన్న బావిని పరిశీలించారు.
నాగన్న బావికి వెళ్లడానికి ఈజీఎస్ నిదులతో రోడ్డును వేయించాలనీ, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటిం చాలనీ, నాలుగు హైమాస్లైట్లను ఏర్పాటు చేయాలనీ, అధికారులను ఆదేశించారు. పనులు పూర్తికాగానే నాగన్నబావిని సందర్శకుల కోసం ప్రారంభిస్తామన్నారు. ప్రాచీన కట్టడాల పరిరక్షణ కోసం ఇన్ఫోసిస్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. స్థానిక పంచాయతీ సెక్రటరీ శ్రావణ్ కుమార్, ఏపీఎం శ్రీనివాస్, ఏపీఓ చంద్రకళ తదితరులున్నారు.