నిర్మల్, వెలుగు:వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.బుధవారం సోన్ మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువం టి ఇబ్బందులు లేకుండా తాగునీరు, టెంటు సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే వరి ధాన్యాన్ని కొను గోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలుకు సంబంధించిన వివరాలను కేంద్రం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సరిపడా సంచుల్ని, టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం కొనుగో లు కేంద్రం వద్ద గల తూకపు యంత్రం, తేమ యంత్రాలను ఆయన పరిశీలిం చారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లేష్, అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.