పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ను పూర్తి చేయాలి : బాదావత్ సంతోష్

పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ను పూర్తి చేయాలి : బాదావత్ సంతోష్
  • జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

 నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్‌‌‌‌‌‌‌‌ను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ను తక్షణమే చేపట్టి నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలన్నారు.  

సెప్టెంబర్ 6న ఓటరు జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువరించి అభ్యంతరాలు స్వీకరించాలని, సెప్టెంబర్ 21 న తుది ఓటరు జాబితాను వెలువరించాల్సి ఉంటుందన్నారు.  ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  పంచాయతీరాజ్ చట్టం-2018 తో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని తెలిపారు.  పొలిటికల్ లీడర్లతో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీపీఓ రామ్మోహన్ రావు, డిప్యూటీ సీఈవో గోపాల్ నాయక్ పాల్గొన్నారు. 

మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కోరారు. గురువారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ హాలులో మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో వెంటనే యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, డీఈఓ గోవిందరాజులు, సోషల్ వెల్ఫేర్ అధికారి రామ్ లాల్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు  పాల్గొన్నారు.