సీఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి :బదావత్ సంతోష్

నస్పూర్, వెలుగు:  జిల్లాలోని రైస్ మిల్లులకు నిర్దేశించిన సీఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్​ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆహార సంస్థ గోదామును అడిషనల్​కలెక్టర్ సబావత్ మోతిలాల్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపాల్ తో కలిసి ఆయన సందర్శించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్న ధాన్యాన్ని ట్యాగింగ్ కలిగిన రైస్ మిల్లులకు సామర్ధ్యానికి అనుగుణంగా తరలించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేసే విధంగా అధికారుల సమన్వయంతో పని చేయాలని కలెక్టర్​ సూచించారు.