
వికారాబాద్ జిల్లా దోమ మండలంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. దోర్నాల్ పల్లి పంచాయతీ ఇన్ చార్జ్ కార్యదర్శి సురేష్, టెక్నికల్ అసిస్టెంట్ నారాయణ రెడ్డిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. దోర్నాల్ పల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, నర్సరీ, శ్మాశనవాటిక నిర్మాణ పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు అధికారులపై చర్యలు తీసుకున్నారు. పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించినందుకు ఎంపీఓ సోమలింగానికి కూడా మెమో జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించి నర్సరీల్లో మొక్కలు ఎండిపోవడానికి కారణమైన ఏపీఓ,టీఏల పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వద్ద నుండి 30 వేల రూపాయలు వసూలు చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.
అనంతరం స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలను, అంగన్ వాడీ కేంద్రాలను పరిశీలించారు. విద్యాభ్యాసం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదివి ప్రయోజకులు కావాలని విద్యార్థులకు కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు.