గద్వాల టౌన్, వెలుగు: గట్టు మండలంలో వైద్యం, విద్య, ఆరోగ్యం వ్యవసాయరంగాల్లో అభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ సంతోష్ అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో గట్టు మండల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గట్టు మండలంలో ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను అడిగి తెలసుకొని, లక్ష్య సాధనలో వెనకబడి ఉన్న శాఖలు పనులు స్పీడప్ చేయాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్ పనులు కంప్లీట్ చేయాలి
గద్వాల: జిల్లాలో పెండింగ్లో ఉన్న పనులు స్పీడప్ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఆర్అండ్ బీ, పీఆర్, టీఎస్ఎంఐడీసీ ఇంజనీరింగ్ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పెండింగ్ పనుల వివరాలను అడిగి తెలుసుకొని వాటిని కంప్లీట్చేయాలని ఆదేశించారు.