- పాల్వంచ గురుకులం నిర్వాహకులపై కొత్తగూడెం కలెక్టర్ సీరియస్
పాల్వంచ, వెలుగు : పరిసరాలు ఇంత అపపరిశుభ్రంగా ఉంటే ఆడపిల్లలు ఎలా చదువుకుంటారని పాల్వంచ జ్యోతినగర్ గురుకుల పాఠశాల నిర్వాహకులపై భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్గురువారం రాత్రి స్కూల్లో ఆకస్మిక తనిఖీ చేసి, స్టూడెంట్లతో మాట్లాడారు. క్లాస్‌రూమ్‌లు, వంట షెడ్లు, కిచెన్, స్టోర్ రూమ్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలు తిరిగే ప్లేస్‌లో కనీసం లైట్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం ఫుడ్ఎందుకు పెట్టడం లేదని వార్డెన్ విజయకుమారిని ప్రశ్నించారు.
వెంటనే ఆమెకు షోకాజ్‌నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. రిజిస్టర్లను తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. రీజినల్ కోఆర్డినేటర్ జ్యోతికి ఫోన్ చేసి నిలదీశారు. గురుకులం పరిసరాలు ఇంత అపరిశుభ్రంగా ఉంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాగే వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోనని, త్వరలో మళ్లీ తనిఖీకి వస్తానని, అప్పటికీ మారకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. కలెక్టర్ వెంట పాల్వంచ ఇన్చార్జ్తహసీల్దార్ వినయ షీల, సిబ్బంది ఉన్నారు.