ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య : కలెక్టర్ జితేశ్. వి. పాటిల్

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య : కలెక్టర్ జితేశ్. వి. పాటిల్
  • కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్. వి. పాటిల్  

నిజాంసాగర్, (ఎల్లారెడ్డి ) వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు.  నిజాంసాగర్ మండల కేంద్రంలో బుధవారం ప్రభుత్వ పాఠశాలలో  విద్యార్థులకు దుస్తులు, పాఠ్య పుస్తకాలను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావుతో కలిసి జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రభుత్వ పాఠశాలలో  విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు.  

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని తల్లిదండ్రులు గుర్తించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.  సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ..  విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని తెలిపారు.  విద్యార్థులు ఇష్టపడి చదివి అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.  కార్యక్రమంలో ఎంఈఓ దేవి సింగ్, మండల కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్, జయ ప్రదీప్, చికోటి  మనోజ్ కుమార్  పాల్గొన్నారు.

ధరణి టౌన్​ షిప్ లో వసతుల కల్పనకు ప్రపోజల్స్

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి టౌన్​శివారులోని ధరణి టౌన్​ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ( రాజీవ్​ స్వగృహా)  మౌలిక వసతుల కల్పనకు ప్రపోజల్స్​ తయారు చేయాలని కలెక్టర్​ జితేశ్ వి.పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో  ధరణి టౌన్​ షిప్ లో వసతుల కల్పనపై ఆఫీసర్లతో మీటింగ్​ నిర్వహించారు.   బీటీ రోడ్ల నిర్మాణం,  డ్రింకిగ్ వాటర్, కరెంట్ లైన్, డ్రైనేజీల నిర్మాణం లాంటి మౌలిక వసతుల కల్పనకు ప్రపోజల్స్ తయారు చేయాలని ఆదేశించారు.

​ ఆఫీసర్లు రిపోర్టు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి  నివేదికలు పంపనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.  అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి, మున్సిపల్ కమిషనర్​ సుజాత,  ఆఫీసర్లు జ్యోతి,  రవిశంకర్​ తదితరులు పాల్గొన్నారు.