
- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
9,189 మంది రెగ్యులర్, 221 మంది ఒక్కసారి ఫెయిల్ అయినా విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర రావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, మున్సిపల్ కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.