నల్లగొండ ప్రభుత్వ హాస్పత్రిలో కుర్చీపై ప్రసవం ఇష్యూపై కలెక్టర్ సీరియస్

నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో గురువారం కుర్చీలో ప్రసవం జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సీరియస్ అయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో శుక్రవారం అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర హాస్పిటల్ ను సందర్శించి విచారణ చేపట్టారు. కుర్చీలో ప్రసవించిన అశ్విని, వారి కుటుంబ సభ్యులతో  మాట్లాడి పూర్తి వివారాలు సేకరించారు. ఆసుపత్రి  పర్యవేక్షకులు, ఆర్ ఎం ఓ , డ్యూటీ డాక్టర్ లతో  సంఘటనపై ఆరా తీశారు. 

ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నట్టు చెప్పారు అదనపు కలెక్టర్. నిర్లక్ష్యం వహించిన డ్యూటీ డాక్టర్  శాంతిస్వరూపతో పాటు, విధుల్లో ఉన్న స్టాఫ్ నర్సులు విజయలక్ష్మి , సైదమ్మ, మౌనిక, సరితలను సస్పెండ్ చేయాలని డిసిహెచ్ ఎస్ ను ఆదేశించారు జిల్లా కలెక్టర్  సి.నారాయణ రెడ్డి.

ALSO READ | ఎంప్లాయీమెంట్ ఆఫీసులో అక్రమాలు