ప్రభుత్వ ఆస్పత్రుల్లో వార్డులు, బెడ్లకు నెంబర్లు ఉండాలి : కలెక్టర్​ ప్రావీణ్య

 ప్రభుత్వ ఆస్పత్రుల్లో వార్డులు, బెడ్లకు నెంబర్లు ఉండాలి : కలెక్టర్​ ప్రావీణ్య

హనుమకొండ, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వార్డులు, బెడ్లకు వారం రోజుల్లో ప్రత్యేకంగా నెంబర్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్​ పి.ప్రావీణ్య ఆఫీసర్లకు సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై హాస్పిటల్​ సూపరింటెండెంట్లు, వైద్యారోగ్యశాఖ అధికారులతో కలెక్టరేట్​ కాన్ఫరెన్స్​ హాలులో రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ  ఆసుపత్రుల్లో ఉన్న పేషెంట్ పేరు, ఏ వార్డులో ఉన్నారనే వివరాలను   బోర్డులపై ప్రదర్శించాలన్నారు.  ఆరోగ్యశ్రీ పరిధిలో ఏఏ జబ్బులు ఉన్నాయో, వాటి ఖర్చు వివరాలను  బుక్ లెట్స్ తయారు చేయాలని సూచించారు.  సూపరింటెండెంట్లకు సమస్యల పరిష్కారంలో సహాయపడేందుకు కోఆర్డినేటర్లను నియమించినట్లు వివరించారు.  ఈ సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ వెంకటరెడ్డి, పరకాల ఆర్డీవో నారాయణ, డీఎంహెచ్​వో సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.