రోడ్డు భద్రతలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్

  రోడ్డు భద్రతలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్

మెదక్​ టౌన్​, వెలుగు:  రోడ్డు భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మెదక్​ జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్​, ఎస్పీ ఉదయ్​ కుమార్​ రెడ్డి అన్నారు. ‌‌రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో మెదక్ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  అవగాహన కల్పించి... అనంతరం ర్యాలీని కలెక్టర్​ రాహుల్​ రాజ్​, ఎస్పీ ఉదయ్​ కుమార్​ రెడ్డి ప్రారంభించారు.  

రోడ్డు భద్రతా నియమాలు సంబంధించి ప్లకార్డులతో  రాందాస్ చౌరస్తా వరకు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​, ఎస్పీలు మాట్లాడుతూ... ప్రమాదాల నివారణకు ‌‌ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు   తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట స్వామి, ఆర్​ అండ్​ బీ ఈఈ సర్ధార్​ సింగ్​, డీఎస్పీ ప్రసన్న కుమార్, ఎంవీఐ  విజయలక్ష్మి, ఏఎంవీఐలు  శ్రీలేఖ, శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.