
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ముస్తాబాద్/ఎల్లారెడ్దిపేట్/గంభీరావుపేట వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మూడు మండలాలలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా పర్యటించారు. మండలాలలో హమ్ (హైబ్రిడ్ అన్యూటి మోడల్) పథకం ద్వారా రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి మర్రిమడ్ల వరకు, గంభీరావుపేట మండలంలోని నర్మాల నుంచి కోళ్ల మద్ది వరకు, ముస్తాబాద్ మండల కేంద్రం నుంచి సిద్దిపేట జిల్లాలోని సరిహద్దు గ్రామం రాజక్కపేట (దుబ్బాక) వరకు రోడ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు.
గంభీరావుపేట మండల కేంద్రం నుంచి లింగన్నపేట మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులని సహితం ఆయన పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ నుంచి ముస్తాబాద్ మండలం నామాపూర్ వరకు రోడ్డు పనులు పక్కా ప్రణాళిక ప్రకారం పనులు వెంటనే చేపట్టాలన్నారు. ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆర్‌అండ్ బీశాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు.