ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పారదర్శకంగా చేపట్టాలి

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను  పారదర్శకంగా చేపట్టాలి
  • జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట, వెలుగు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు.  సోమవారం జిల్లా కలెక్టర్ నారాయణపేట  మండలంలోని జాజాపూర్ గ్రామం హరిజనవాడలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  జిల్లా వ్యాప్తంగా  సర్వే కొనసాగుతోందని  ప్రతిరోజు సర్వే నివేదికలు ప్రభుత్వానికి ఆన్ లైన్ విధానం ద్వారా పంపిస్తామన్నారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం కచ్చితమైన సమాచారం క్షేత్రస్థాయిలో సేకరించాలని సిబ్బందికి సూచించారు. 

హరిజన వాడలోని రెండు నివాసాల వద్ద ఇందిరమ్మ ఇండ్ల సర్వే ఎలా జరుగుతుందని ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా కలెక్టర్ పర్యవేక్షించారు. తర్వాత సింగార్​ క్రాస్​రోడ్​లో ఉన్న డీఎంహెచ్‌ఓ, డీఆర్డీఓ కార్యాలయాలను కలెక్టర్​ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది తక్కువగా ఉండడం చూసి అక్కడున్న వారిని ప్రశ్నించారు. జిల్లా క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న సీఎం కప్​ పోటీలను కలెక్టర్​ 
ప్రారంభించారు.