ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందించాలి: కలెక్టర్

నిర్మల్, వెలుగు :  నిర్మల్ జిల్లాలోని అన్ని గవర్నమెంట్ హాస్పిటళ్లలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆయన 

మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏఎంసీ వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలని, ఆస్పత్రిలో అందిస్తున్న సేవలు, నార్మల్ డెలివరీలపై దృష్టి పెట్టాలని సూచించారు. డెలివరీకి ప్రభుత్వ ఆస్పత్రికే వచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనిమీయా సే నిర్మల్ ముక్త్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు. 

ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేవారిలో పేదలే ఎక్కువగా ఉంటారని, డాక్టర్లంతా మానవతా దృక్పథంతో సేవలందించాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అమ్మద్, డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ధనరాజ్ పాల్గొన్నారు.