
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: భూ భారతి -చట్టం 2025 అమలులో రెవెన్యూ అధికారులే కీలకమని చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 'భూ భారతి' భూమి హక్కుల రికార్డు - 2025 చట్టంపై తహసిల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు , ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది, అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూభారతి చట్టంలోని ముఖ్యంశాలను వివరించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ.. గతంలో ఉన్న ధరణి స్థానంలో భూభారతి భూమి హక్కుల రికార్డు - 2025 చట్టాన్ని కొత్తగా తీసుకువచ్చిందని తెలిపారు. ఈ చట్టంపై రెవెన్యూ అధికారులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. ఏప్రిల్ 17 నుంచి మండలాల వారీగా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి చట్టం పై అవగాహన, అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మోహన్ రావు, ఆర్డీవో నవీన్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్, నియోజక వర్గ ప్రత్యేక అధికారులు, జడ్పీ సీఈఓ వెంకట రెడ్డి, డీసీఓ శంకరా చారి,