
మేడ్చల్ కలెక్టరేట్ వెలుగు: మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన పెంచేందుకు ఆర్బీఐ సూచనలతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఉద్యోగులు 2కే వాక్ ను నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ‘మహిళా శ్రేయస్సు’ నినాదంతో ఆర్థిక ప్రణాళిక, సూక్ష్మ పొదుపులు, నష్టాల తగ్గింపుపై దృష్టి సారించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్ఓ హరిప్రియ, జిల్లా లా ఆఫీసర్ చంద్రావతి, జిల్లా సంక్షేమాధికారి, బిసి వెల్ఫేర్అధికారి, ఎస్సీ వెల్పేర్అధికారి, డిఆర్డిఓ, ఎల్డిఎం, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.