- టీయూఎఫ్ జిల్లా కన్వీనర్ మంజూర్
పాల్వంచ,వెలుగు : ఉద్యమకారులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కన్వీనర్ ఎండి మంజూర్ అన్నారు. ఆదివారం పాల్వంచలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద చలో ఇందిరా పార్క్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈనెల 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రావణ బోయిన నర్సయ్య, శ్రీపాద సత్యనారాయణ, ఇజ్జగాని రవి, బొల్లం భాస్కర్, ఎస్డీటీ హుసేన్, పొదిలి సూరిబాబు, గడ్డం సీతారాములు, కేసరి రవీందర్, మురళీకృష్ణ పాల్గొన్నారు.