అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చెయ్యాలి : డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి

అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చెయ్యాలి : డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి

సిద్దిపేట టౌన్, వెలుగు :  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను వెంటనే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని జిల్లా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్ లో కలెక్టర్ మనుచౌదరి కి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నిరసన తెలిపారు.

 ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ ను పార్లమెంట్ లో కించపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షాను ఎందుకు క్యాబినెట్ నుంచి తొలగించట్లేదని ప్రశ్నించారు. బలహీన వర్గాల ప్రజలు దేవుడిలా ఆరాధించే అంబేద్కర్ గురించి వ్యంగంగా మాట్లాడం సబబు కాదన్నారు. బీజేపీ మొదటి నుంచి అంబేద్కర్ వ్యతిరేక పార్టీ అని మతాన్ని అడ్డుపెట్టుకొని పాలించే పార్టీ అన్నారు.