- డిప్యూటీ డీఎం హెచ్ వో సైదులు
కామేపల్లి, వెలుగు : ప్రభుత్వ ఆరోగ్య పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అందుకు వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా డిప్యూటీ డీఎం హెచ్ వో సైదులు సూచించారు. మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన ఆశా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాత, శిశు ఆరోగ్యం పై వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గర్భిణుల సంరక్షణ ఎర్లీ రిజిస్ట్రేషన్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారిణి డాక్టర్ చందన సీహెచ్ వో సుధారాణి, హెచ్ఈవో వెంకటేశ్వరరావు, హెల్త్ సూపర్వైజర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.