బోధన్, వెలుగు : అపార్ నమోదు వందశాతం పూర్తి చేయాలని జిల్లా విద్యాధికారి అశోక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బోధన్ మండలంలోని ప్రైవేట్, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ, జ్యోతిబాఫూలే, మైనార్టీ, కాలేజీల ప్రిన్సిపాల్స్, హెడ్మాస్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ అపార్ (అటోమెటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్టర్) నమోదు జనవరి 25లోపు పూర్తి చేయాలన్నారు.
విద్యార్థుల అంగీకార పత్రంతో ఆధార్ కార్డు, పుట్టిన తేది, తల్లిదండ్రుల వివరాలను సరిచూసుకోవాలని చెప్పారు. విద్యార్థుల సమగ్రమైన వివరాలు అపార్లో నమోదు చేయాలని సూచించారు. భవిషత్లో అపార్ ద్వారానే ఒక స్కూల్ నుంచి మరో సూల్క్ కు ట్రాన్స్ ఫర్చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి నాగయ్య, సీఆర్పీలు విజయ్, యూసూఫ్, విజయ, రేఖ, శివానంద్, ప్రైవేట్ స్కూల్స్, ప్రిన్సిపాల్స్, కరస్పాండెంట్లు పాల్గొన్నారు.