ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలి : మహేష్​ దత్​

ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలి : మహేష్​ దత్​
  • టీచర్స్​ ఎన్నికల పరిశీలకులు మహేష్​ దత్​ ఎక్కా
  • అధికారులతో రివ్యూ మీటింగ్​ 

మెదక్​ టౌన్​, వెలుగు: మెదక్​ జిల్లా వ్యాప్తంగా టీచర్స్​ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా  టీచర్స్​ఎన్నికల పరిశీలకులు మహేష్​దత్​అన్నారు. మెదక్​లో బుధవారం టీచర్స్ ఎన్నికల విధులు నిర్వహించే నోడల్ అధికారులతో కలెక్టరేట్​లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్​ దత్​మాట్లాడుతూ..   ఈ నెల 27న జరిగే మెదక్​, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్  ఏర్పాట్లపై వివరాలను తెలుసుకున్నారు.

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలు-21 ఉండగా,1,347 మంది ఓటర్లు  తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు.  ఈనెల 11వ తేదీన పీవోలు, ఏపీవోలకు ట్రైనింగ్​ నిర్వహించామని... రెండో విడత ఈనెల 21న ట్రైనింగ్​ పూర్తవుతుందని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని వివరించారు.సమావేశంలో జిల్లా అడిషనల్​ కలెక్టర్​నగేశ్​, మెదక్​, తూప్రాన్, నర్సాపూర్​ ఆర్డీవోలు రమాదేవి, జయచంద్రారెడ్డి, మహిపాల్​రెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్​ రావు, డీపీవో యాదయ్య, సంబంధిత శాఖ అధికారులు, నోడల్​ అధికారులు తదితీరులు పాల్గొన్నారు.