
మెదక్ టౌన్, వెలుగు: మీడియా సర్టిఫికేషన్ ఆఫ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) సెంటర్‌ను మంగళవారం జిల్లా ఎన్నికల పరిశీలకుడు పృధ్వీరాజ్, వ్యయ పరిశీలకుడు సంజయ్ కుమార్, పోలీస్పరిశీలకుడు సంతోష్ కుమార్ తుకారాం తనిఖీ చేశారు. వారి వెంట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్ఉన్నారు. ఈ సందర్భంగా వారు చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల రికార్డింగ్ పనితీరును పరిశీలించారు.
అనంతరం కలెక్టర్రాజర్షి షా.. సీ- విజిల్ యాప్‌లో వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారాలు, మీడియాలో వచ్చే వార్తల గురించి వివరించారు.