పులి జాడ కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశాం : అటవీ శాఖ అధికారి బాలమణి

పులి జాడ కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశాం : అటవీ శాఖ అధికారి బాలమణి
  •     జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి

వేములవాడ, వెలుగు :  పెద్దపులి జాడ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేస్తున్నామని జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి అన్నారు.  శనివారం వేములవాడ పట్టణంలోని ఫారెస్టు రేంజ్​ఆఫీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారంపై వేములవాడ రేంజ్​పరిధిలో వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా మూడు బృందాలుగా ఏర్పాటు చేసి గాలిస్తున్నామన్నారు.  జగిత్యాల జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో  మరో మూడు టీంలు పులి జాడ కోసం వెతుకుతున్నాయన్నారు.  

సోషల్ మీడియా వేదికగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పులి పట్టుకున్నట్లు ప్రచారం చేస్తున్నారని, అపోహలను ఎవరు నమ్మవద్దని సూచించారు.  పొలాల వద్దకు వెళ్లే రైతులు తప్పనిసగిరా అటవీ శాఖ అధికారులు చెప్పే సూచనలు పాటించాలన్నారు. పంట పొలాలకి వెళ్లేవారు  జాగ్రత్తగా ఉండాలని, అటవీ గ్రామాలకు అనుకొని ఉన్న పొలాల వారు ఆవులను, పశువులను బయట కట్టి వేయొద్దన్నారు.  కరెంట్ తీగలను తొలగించాలని కోరారు. కార్యక్రమంలో వేములవాడ పారెస్టు రేంజ్​ అఫీసర్​ ఖలీల్ ఉద్దీన్, సెక్షన్​ అఫీసర్ అప్జల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.