
ఖమ్మం, వెలుగు : జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ వరి నాట్లు వేశారు. బుధవారం ఖమ్మం నుంచి కనకగిరి కొండల్లో వెదురుతోటల పరిశీలనకు వెళ్తున్న ఆయనకు సూరారంలో వరి నాట్లు వేస్తున్న గిరిజనులు కనిపించారు. దీంతో ఆయన కారు దిగి పొలం గట్లపై నడుచుకుంటూ వెళ్లి గిరిజనులతో మాట్లాడారు.
స్థానిక మహిళలతో కలిసి ఆయన కూడా కాసేపు వరి నాట్లు వేశారు.