ఆర్మూర్, వెలుగు: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా జనరల్ సెక్రెటరీ ద్యాగ శేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆర్మూర్‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 8న నిర్వహించనున్న బీసీ విద్యార్థుల సమర శంఖారావం కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ద్యాగ శేఖర్ మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టూడెంట్స్తో సమానంగా బీసీ స్టూడెంట్స్కు ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.
8న హైదరాబాద్ లో జరిగే బీసీ విద్యార్థుల సమర శంఖారావం కు స్టూడెంట్స్ హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీవీర్ జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ కొట్టూరు గిరిరాజ్, నరేష్, సాయితేజ, మనోహర్, మహేష్, రుచిత్, కార్తీక్, నితిన్, భార్గవ్, భారత్, రిషిత, వరుణ్ తదితరులు
పాల్గొన్నారు.