ములకలపల్లి, వెలుగు : ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారారిణి సులోచనా రాణి స్టూడెంట్స్‌కు సూచించారు. మంగళవారం ములకలపల్లి జూనియర్ కాలేజీలో ఓటు హక్కు వినియోగంపై ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో వంద శాతం పోలింగ్ జరగాలనే లక్ష్యంతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల నేతృత్వంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు.
ఎన్నికల్లో ఎక్కడైనా అక్రమాలకు పాల్పడితే ఫిర్యాదు చేసేందుకు సీ విజిల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. 1950 నంబర్ కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. నిష్పక్షపాతంగా, నిజాయితీగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకుంటామని కళాశాల సిబ్బంది, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నదియాసుల్తానా, ఎంపీడీవో లక్ష్మయ్య, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ రాజేశ్వరి, స్వీప్ కో ఆర్డినేటర్ సుధాకర్, లెచ్చర్లు రాణి, కుమార్, రామకృష్ణ, చంద్రమౌళి, సుచరిత, రంజిత్ పాల్గొన్నారు.